తాండూరు సర్పంచ్ అభ్యర్థికి గుండెపోటు
MNCL: రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా తాండూరులో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకటస్వామికి శనివారం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. వెంటనే స్థానికులు స్పందించి ఆయనను హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. వెంకటస్వామి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.