చెన్నారావుపేట మండలంలో బరిలో ఎంత మంది తెలుసా?
WGL: చెన్నారావుపేట మండలంలో పంచాయతీ ఎన్నికల ఉత్కంఠ నెలకొంది. మండలంలో మొత్తం 30 సర్పంచ్ స్థానాలకు గాను ఒకరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 29 సర్పంచ్ స్థానాల కోసం 91 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే, 258 వార్డు సభ్యుల స్థానాల్లో 35 ఏకగ్రీవం కాగా, మిగతా 223 స్థానాల కోసం 564 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.