భారీ వర్షం.. పిడుగు పడి ఒకరు, చెట్టుకూలి మరో బాలుడు మృతి

భారీ వర్షం.. పిడుగు పడి ఒకరు, చెట్టుకూలి మరో బాలుడు మృతి

కృష్ణా: జిల్లాలో వర్షాల ప్రభావంతో ఇద్దరు మృతిచెందారు. మండవల్లి మండలం దెయ్యం పాడులో పిడుగుపాటుతో రొయ్యల చెరువులో పనిచేస్తున్న సైదు గిరిబాబు(30) మృతి చెందాడు. అలాగే.. నూజివీడు మండలం ముసునూరు చెక్కపల్లిలో భారీ ఈదురు గాలులతో కూడిన వర్షంతో ఓ ఇంటిపై భారీ వృక్షం కూలి బాలుడు మృతిచెందాడు.