VIDEO: బోధపురంలో రోడ్డెక్కిన విద్యార్థులు

VIDEO: బోధపురంలో రోడ్డెక్కిన విద్యార్థులు

MLG: వెంకటాపురం మండలం బోధపురం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సోమవారం రోడ్డెక్కి నిరసన చేపట్టారు. శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాన్ని తొలగించి కొత్త భవనం నిర్మించాలని, వెంటనే రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించేవరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు తెలిపారు. ఈ నిరసనతో కొంతసేపు రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.