ఫైనల్‌కు దూసుకెళ్లిన శ్రీకాంత్.. టైటిల్ గెలుస్తాడా?
లక్నోలో జరుగుతున్న సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్, తెలుగు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. సెమీస్‌లో శ్రీకాంత్ 21-15, 19-21, 21-13 తేడాతో మరో భారత ఆటగాడు మంజునాథ్‌పై గెలిచాడు. యువ షట్లర్ నుంచి శ్రీకాంత్ గట్టిపోటీనే ఎదుర్కొన్నాడు. 59 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ను విజయం వరించింది.