విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే

W.G: ఇరగవరం మండలంలో స్కూలు బస్సు పంటచేలోకి దూసుకెళ్లిన ఘటనలో గాయపడ్డ విద్యార్థులను తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ గురువారం పరామర్శించారు. బస్సులో 25 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. వారిని తణుకు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స చేసిన తర్వాత ఇంటికి పంపించారు. స్కూల్ బస్సులపై అధికారుల పర్యవేక్షణ అవసరమని ఎమ్మెల్యే అన్నారు.