యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్
TG: మహబూబ్‌నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల(M) మాచారం సమీపంలో NH44పై జగన్ ట్రావెల్స్ బస్ యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. దీంతో దట్టంగా పొగలు వ్యాపించాయి. కడప నుంచి హైదరాబాద్ వస్తున్న ఈ బస్‌లోని 40 మంది ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా సురక్షితంగా బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు చెలరేగకుండా చర్యలు చేపట్టారు.