కాజీపేట మండల కేంద్రంలో 350 సైలెన్సర్ ధ్వంసం
హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో ఇవాళ 350 ద్విచక్ర వాహనాల సైలెన్సర్లను పోలీసులు రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. ద్విచక్ర వాహనాలకు ప్రత్యేక సైలెన్సర్లను బిగించుకొని బాటసారులను భయపెడుతున్న వాహనాలను పట్టుకొని సైలెన్సర్లను తొలగించారు. వీటిని రహదారిపై పరిచి ధ్వంసం చేశారు డీసీపీ రాయల ప్రభాకర్, ఏసీపీ మధుసూదన్ సిఐ వెంకన్న పాల్గొన్నారు.