గ్రామ సంఘ భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
NLG: కేతపల్లి మండలం ఇనుపాముల గ్రామంలో గ్రామ సంఘ బంధం సమైక్య పక్కా భవన నిర్మాణానికి రూ.10 లక్షల వ్యయంతో ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ యువత క్రీడ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వాలీబాల్ కోర్టును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే కొంతసేపు గ్రామ యువతతో కలిసి వాలీబాల్ ఆడారు. ఈ సందర్భంగా సర్పంచ్ బొజ్జ సుందర్‌ను ఎమ్మెల్యే అభినందించారు.