పిల్లల పోషణ ఆరోగ్య విషయాలపై అవగాహన

కొయ్యూరు: మండలంలోని మారుమూల లూసం బలబద్రం, నడింపాలెం, ఎం.మాకవరం అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహించిన పోషణ వేడుకలను సీడీపీఓ విజయకుమారి పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. మూడేళ్ల లోపు పిల్లల్లో పోషణ, ఆరోగ్య విషయాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తల్లులకు, అంగన్వాడీ సిబ్బందికి అవగాహన కల్పించారు.