వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ

అల్లూరి: వినాయక చవితి వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలని గురువారం జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ప్రజలకు సూచించారు. వినాయక మండపాలు ఏర్పాటు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలని సూచించారు. భక్తులు, ఉత్సవ నిర్వాహకులు పండుగ ప్రశాంతంగా జరిగేలా అధికారులకు సహకరించాలని కోరారు. ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.