వ్యక్తి అనుమానాస్పద మృతి

అన్నమయ్య: రాయచోటి వద్ద వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. రాయచోటిలోని కాటిమాయకుంట రహదారి సమీపంలో వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందారు. మృతుడు కాటిమాయకుంట శ్రీను(45)గా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు హత్యా? ఆత్మహత్యా? అని పరిశీలిస్తున్నారు.