'ప్రజలకు శుద్ధి చేసిన తాగునీరు అందిస్తాం'
SDPT: ప్రజలకు నాణ్యమైన, శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తామని మున్సిపల్ కమిషనర్ ఆశ్రీత్ కుమార్ హామీ ఇచ్చారు. కొద్ది రోజులుగా నీరు మురికిగా వస్తుండటంతో శుక్రవారం ఆయన మంగోల్ వద్ద ఉన్న మల్లన్నసాగర్ 540 MLD వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇల్లంతకుంట ఫిల్టర్ బెడ్లను సందర్శించారు. సమస్యను అడిగి తెలుసుకున్న ఆయన.. ఫిల్టేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.