వినుకొండలో బంగారం వ్యాపారిపై దాడి
PLD: వినుకొండలో బంగారం వ్యాపారిపై దాడి జరిగింది. వ్యాపారి కోటేశ్వర రావుపై ఐదుగురు వ్యక్తులు దారుణంగా దాడి చేశారు. తన స్వగ్రామంలో నిర్మించిన ఆలయ ఖర్చుల వివరాలు అదిగినందుకు కక్ష పెంచుకుని దుండగులు దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వ్యాపారి పోలీసులను ఆశ్రయించి, న్యాయం చేయాలని కోరారు.