40 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

40 మెట్రిక్ టన్నుల యూరియా పంపిణీ

MHBD: గూడూరు మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయంలో శనివారం 40 మెట్రిక్ టన్నుల యూరియాను రైతులకు పంపిణీ చేసినట్లు మండల వ్యవసాయాధికారి అబ్దుల్ మాలిక్ తెలిపారు. మొత్తం 888 యూరియా బస్తాలు అందించామని, రైతులందరికీ యూరియా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని, ఆందోళన అవసరం లేదని చెప్పారు. అపోహలను నమ్మవద్దని సూచించారు.