సైన్యాన్ని ప్రశంసించిన కాంగ్రెస్ అధ్యక్షుడు

'ఆపరేషన్ సింధూర్'పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఖర్గే మాట్లాడుతూ.. పాకిస్తాన్, POKలో ఉగ్రవాద శిబిరాలను అణిచివేసిన మన సాయుధ దళాలను చూసి గర్వపడుతున్నామని తెలిపారు. భారత ఆర్మీ ధైర్యసాహసాలను, దేశభక్తిని కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని పేర్కొన్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో దేశం మొత్తం ఏకతాటిపై నిలబడిందన్నారు.