కసాపురం ఆలయంలో దసర శరన్నవరాత్రులు ప్రారంభం

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామివారి అనుబంధ దేవాలయమైన శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ఈనెల 22 నుంచి అక్టోబర్ 2 వరకు దసర శరన్నవరాత్రులు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈవో విజయరాజు మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 6:45 గంటలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, హారతులు నిర్వహిస్తామని భక్తులకు తెలిపారు.