'2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది'

ELR: ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ప్రవాహం పెరగటంతో జిల్లాలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం తెలిపారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 47 అడుగులకు చేరుకుందన్నారు. ఉధృతి ఇలాగే కొనసాగితే 2వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందన్నారు. అందుకు తగిన విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందన్నారు.