'నిల్వలకు అనుగుణంగా లారీలు అందుబాటులో ఉండాలి'
SRCL: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిలువలకు అనుగుణంగా లారీలు అందుబాటులో ఉండాలని, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. బోయినపల్లి, కోనరావుపేట మండలాలకు చెందిన కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, లారీల కాంట్రాక్టర్లతో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల్లో ధాన్యం కొనుగోళ్లు, నిల్వలపై ఆరా తీశారు.