ఆరుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్, బిజూ జనతా దళ్(BJD) పార్టీల్లో పెను ప్రకంపణలు సృష్టించాయి. ఒడిశాలో క్రాస్ ఓటింగ్ జరిగి BJP, స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. దీంతో BJD సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఆరుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.