క్షమాపణలు చెప్పిన ఇండిగో సీఈవో
ఇండిగో విమానయాన సంస్థ గత మూడు రోజులుగా ఆపరేషనల్ సమస్యలను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ అధికారికంగా క్షమాపణలు చెప్పారు. ప్రతి ప్రయాణికుడికి మంచి అనుభవం ఇవ్వాల్సిందేనని, కానీ గత కొన్ని రోజుల్లో ఆ హామీని నిలబెట్టుకోలేకపోయామన్నారు. ఈ పరిస్థితి చక్కదిద్దాలని చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు.