'మహిళా జర్నలిస్టులకు పెన్షన్'

VSP: 45 ఏళ్లు దాటిన మహిళా వర్కింగ్ జర్నలిస్టులకు కూడా పెన్షన్ పథకం వర్తిస్తుందని విశాఖకు చెందిన ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ కంచర్ల అచ్యుతరావు ఆదివారం తెలిపారు. అర్హులైన వారు విశాఖలోని ఆరిలోవ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. నెలకు రూ. 4,000 పెన్షన్ అందిస్తామని చెప్పారు. ఈ అవకాశాన్ని అర్హులైన మహిళా జర్నలిస్టులందరూ ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.