పొగాకు రైతులకు గుడ్ న్యూస్

ప్రకాశం: రైతుల సౌకర్యార్థం ఈ ఏడాది నుంచి ప్రతి మూడేళ్లకోసారి పొగాకు బ్యారెన్ రిజిస్ట్రేషన్ జరుగుతుందని కొండపి పొగాకు వేలం నిర్వహణ అధికారి సునీల్ తెలిపారు. భారత వాణిజ్య పరిశ్రమల శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఏడాదికోసారి రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాగా, ఇకపై మూడేళ్లకోసారి నమోదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.