ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన గ్యాస్ సిలిండర్లు సీజ్
ATP: గుత్తి మండలం అబ్బే దొడ్డి గ్రామంలో నారాయణరెడ్డి అనే ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన గ్యాస్ సిలిండర్లను ఆదివారం జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సీజ్ చేశారు. పౌరసరఫరాల శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సిలిండర్లను అక్రమంగా నిలువ ఉంచారని సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు చేశామన్నారు. పది గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.