ఆరేడులో ఘనంగా అమ్మవార్ల జాతర
W.G: ఉండి మండలం ఆరేడు గ్రామంలో వేంచేసియున్న ముత్యాలమ్మ, కొండాలమ్మ, పోతురాజుల వార్ల జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. తొలుత అమ్మవార్లకు ధూప దీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. సర్పంచ్ కట్రెడ్డి బ్రహ్మానందం, కుసంపూడి రాంభద్రరాజు, పోలేశ్వరరావు, ఆలయ కమిటీ సభ్యులు పోతిరెడ్డి సత్తిబాబు, పోలిశెట్టి బ్రహ్మానందం, పోతుల నాని, గ్రామస్తులు పాల్గొన్నారు.