ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటాం: డిప్యూటీ సీఎం

ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటాం: డిప్యూటీ సీఎం

 KKD: ఉప్పాడలో మత్స్యకారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మత్సకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన చేపడతామని, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాల తప్పిదాల వల్ల ప్రజాధనం వృథా అయిందని ఆయన ఆరోపించారు.