నేడు జిల్లాలో పర్యటించనున్న సీఎం
గుంటూరు జిల్లాలోని పెదకాకానిలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శంకర కంటి ఆసుపత్రిలో కొత్తగా నిర్మించిన అదనపు భవన సముదాయాన్ని మధ్యాహ్నం 3 గంటలకు సీఎం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో హైవే సర్వీస్ రోడ్డు పక్కన హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ ఏర్పాట్లను కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యవేక్షించారు.