సెప్టెంబర్ 1 నుంచి పోషకాహార మాసోత్సవాలు

NLR: ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు నెల్లూరు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ హేన సుజన ఒక ప్రకటనలో తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారం గురించి తల్లులకు అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు.