24 గంటల్లోనే ఆన్‌లైన్ ఇంటి పట్టాలు
ATP: ఎమ్మెల్యే బండారు శ్రావణి బుక్కరాయసముద్రం మండలం జన చైతన్య నగర్, ఎల్బీ కాలనీలలో పర్యటించి, స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పీఎంఏవై పథకం కింద తొమ్మిది మందికి 24 గంటల్లోనే ఆన్‌లైన్ ఇంటి పట్టాలు మంజూరు చేయించి, పంపిణీ చేశారు. అనంతరం డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్లు, అంగన్‌వాడీ భవనం మంజూరుపై వినతులను స్వీకరించారు.