'మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి'

'మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలి'

KRNL: షికారి మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించాలని కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి సూచించారు. డాన్ బాస్కో సంస్థ ఆధ్వర్యంలో షికారి మహిళలకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు పసుపుల గ్రామంలో ఏర్పాటు చేయనున్న డాన్బాస్కో షికారి ప్రాజెక్టుకు సోమవారం భూమిపూజ నిర్వహించారు. షికారి మహిళలు ఈ కేంద్రంలో ఇచ్చే శిక్షణను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని కాంక్షించారు.