VIDEO: నాచుపల్లి రాముల గుట్టలో శ్రీరామనవమి వేడుకలు
KMR: నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి రాముల గుట్ట ఆలయం శ్రీరామ నవమి వేడుకలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. నేడు అర్ధరాత్రి స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ తెలిపింది. భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఇవాళ జాతరతో పాటు కుస్తీ పోటీలు జరగనున్నాయి.