పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి: ఏఎస్పీ

BDK: గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో గురువారం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్, జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివ నాయక్ పాల్గొన్నారు. పట్టణాన్ని పచ్చని భద్రాచలంగా మార్చే ప్రయత్నంలో తోడుగా ఉంటామని, ప్రతి ఒక్కరూ తమకు వీలైన సందర్భాలలో మొక్కలు నాటాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు.