వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృతి

వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృతి

MHBD: వీధి కుక్కల దాడిలో గొర్రెలు మృతి చెందిన ఘటన గురువారం చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. చిత్తూరు యాకన్న అనే గొర్రెల కాపరి భోజనం కోసం ఇంటికి వెళ్లిన సమయంలో వీధి కుక్కలు గొర్రెల మందపై దాడి చేశాయి. దాడిలో 15 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయని బాధితుడు కన్నీటిపర్యంతం అయ్యాడు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.