నోబెల్‌ గ్రహీతకు 'అవార్డు' చిక్కులు

నోబెల్‌ గ్రహీతకు 'అవార్డు' చిక్కులు

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మరియా మచాడోకు అవార్డు అందుకోవడానికి చిక్కులు తలెత్తాయి. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఆమె అవార్డు అందుకోవడానికి దేశం విడిచి వెళ్తే పరారీలో ఉన్న నేరస్తురాలిగా పరిగణిస్తామని వెనెజువెలా అటర్నీ జనరల్ ప్రకటించారు. మరియాపై కుట్రలు, విద్వేషాన్ని రెచ్చగొట్టడం వంటి పలు ఆరోపణలపై కేసులు ఉన్నాయని తెలిపారు. దీంతో ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు.