ముత్తినేని గౌరీ ప్రసాద్ విశిష్ట సేవలకు గుర్తింపు

ముత్తినేని గౌరీ ప్రసాద్  విశిష్ట సేవలకు గుర్తింపు

BDK: మణుగూరు ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముత్తినేని గౌరీ ప్రసాద్ విశిష్ట సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర చేతుల మీదుగా ఇవాళ అవార్డు అందుకున్నారు. ఆరోగ్య సేవల అభివృద్ధి, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడంలో ఆయన చూపిన కృషి ప్రశంసనీయం. మణుగూరు ప్రాంత ప్రజలకు సమయానికి వైద్యసేవలు అందేలా ఆయన చేపట్టిన చర్యలు విశేష ఫలితాలను ఇచ్చాయి.