నేడు తేలప్రోలులో ఆధార్ శిబిరం

కృష్ణా: ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామ సచివాలయంలో గురువారం ఉదయం 10:30 గంటలకు ఆధార్ శిబిరం నిర్వహించనున్నట్టు గ్రామ సర్పంచ్, సెక్రటరీ తెలిపారు. ఆధార్ కార్డుల బయోమెట్రిక్ అప్డేట్లు, ఫోన్ నంబర్ మార్పులు, ఇతర సమాచారం సవరణలు చేయించుకోవచ్చున్నారు. 5 - 18 ఏళ్ల వయస్సు వారు కొత్త ఆధార్ కార్డులు అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు.