సెప్టెంబర్ నెల నుంచి అక్షరాస్యత ఉద్యమం

HYD: సెప్టెంబర్ నెల నుంచి 100 రోజుల పాటుగా అక్షరాస్యత ఉద్యమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలలో ఈ ఉద్యమం ప్రారంభం కానుందని తెలిపారు. 15 ఏళ్ల వయసు దాటిన వారి కోసం ప్రత్యేకంగా 16 పాఠాలు ముద్రించి, అక్షర వికాసం కోసం ప్రభుత్వం కృషి చేయనున్నట్లుగా పేర్కొంది.