'ధాన్యాన్ని కొని గోదాములకు తరలించాలి'

'ధాన్యాన్ని కొని గోదాములకు తరలించాలి'

MNCL: జన్నారం మండలంలోని అన్ని గ్రామాలలో రైతుల ధాన్యాన్ని కొని గోదాములకు తరలించాలని సీపీఎం జన్నారం మండల కార్యదర్శి కొండగొర్ల లింగన్న డిమాండ్ చేశారు. శనివారం జన్నారంలోని సీపీఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మండలంలోని పలు గ్రామాలలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కొనుగోలు నత్త నడకన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.