'అదనపు ఛార్జీలు తీసుకుంటే కఠిన చర్యలు'

అల్లూరి: దీపం పథకంలో రాష్ట్రంలో కోటి మందికి ఉచిత సిలిండర్ల లబ్ధి అందిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గిరిజన ప్రాంతంలో సిలిండర్ సరఫరాలో రూ.851లు కన్నా అధిక చార్జీలు తీసుకుంటున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అటువంటి వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. అల్లూరి జిల్లా పర్యటనలో భాగంగా సోమవారం అరకులోయలో మీడియాతో మాట్లాడారు.