ఎస్సైకి ప్రశంసాపత్రం అందించిన ఎస్పీ

VZM: ఇటీవల నీలకంఠరాజపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసును కొద్ది రోజుల్లోనే వల్లంపూడి ఎస్సై ఎస్. సుదర్శన్ ఛేదించారు. ఓ వ్యక్తిని ఢీకొట్టి ఘటన స్థలం నుంచి పరారయ్యాడు. కేసును క్రియాశీలకంగా తీసుకొని గాలించగా అనకాపల్లిలో పట్టుకొని కేసు నమోదు చేశారు. వృత్తిలో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన ఎస్సైకు బుధవారం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి ప్రశంసా పత్రం అందజేశారు.