16 రోజుల్లో యాత్ర పూర్తి చేసుకున్న.. ఫైర్ అధికారులు

16 రోజుల్లో యాత్ర పూర్తి చేసుకున్న.. ఫైర్ అధికారులు

ఉమ్మడి వరంగల్ జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులు నాగరాజు, రామారావు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4,000 కిలోమీటర్ల సైక్లింగ్ రైడ్‌ను కేవలం 16 రోజుల్లో విజయవంతంగా పూర్తి చేశారు. సర్దార్ వల్లభాభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘ఫిట్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ యాత్ర చేపట్టినట్లు అధికారులు తెలిపారు.