ఘనంగా పోచమ్మ బోనాలు

KNR: శంకరపట్నం మండలం లింగాపూర్ గ్రామంలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మ తల్లికి బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి బోనాలతో, ఊరేగింపుగా డప్పు చప్పులతో శివశక్తుల పూనకాలతో ఆలయానికి తరలి వెళ్లారు. అమ్మవారి నామస్మరణతో బోనాలు సమర్పించి పాడి, పంట, ప్రజలు సురక్షితంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.