పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

ATP: జిల్లాలోని పొట్టి శ్రీరాములు ప్రభుత్వ పాఠశాలలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భారత న్యాయవాదుల సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు జె. రాజారెడ్డి మాట్లాడారు. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని అధికారికంగా ఆమోదించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ఉన్నారు.