HYDలో మటన్ షాపులవైపే మొగ్గు..!

HYD: భోజన ప్రియులకు ఆదివారం మాంసం ఉండాల్సిందే. అందుబాటు ధరలో ఉండే చికెన్.. బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో కొనడంలేదు. మటన్, ఫిష్ వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో వీటి ధరలు HYDలో భారీగా పెరిగాయి. జియాగూడ మటన్ మండీలో కిలో రూ.400 ఉండే మటన్ ఇప్పుడు రూ.600, చెంగిచర్లలో రూ.500 ఉండేది కాస్తా పెరిగి రూ.800 చేరింది. స్థానిక మటన్ షాపుల్లో రూ.వెయ్యికి విక్రయిస్తున్నారు.