కూకట్ పల్లి పీఎస్ వద్ద సహస్ర కుటుంబ సభ్యుల ఆందోళన

HYD: కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ ఎదుట సహస్ర కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని తమ ముందుకు తీసుకురావాలని వారు కోరుతున్నారు. ఈ సంఘటనతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుటుంబసభ్యులు తమ కుమార్తెకు జరిగిన అన్యాయానికి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.