టీకాలు, మందుల పంపిణీ వంద శాతం పూర్తి చేయాలి: కలెక్టర్
NRPT: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు పలు రికార్డులను, సిబ్బంది వివరాలను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో ఎన్సీడీ ప్రోగ్రాంపై సమీక్షించి, వైద్యశాఖ కార్యక్రమాలు, టీకాలు, మందుల పంపిణీ వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.