VIDEO: లక్కీ డ్రా నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
మహబూబాబాద్ జిల్లాలో నేడు మద్యం షాపుల కోసం లాటరీ పద్ధతిలో డ్రా తీయనున్నారు. మొత్తం 61 మద్యం షాపుల కోసం 1800 దరఖాస్తుదారులకు డ్రా తీయడానికి ఎక్సైజ్ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో ఈ డ్రా జరగనుంది. ఈ అదృష్టం ఎవరికి వరిస్తుందో అని దరఖాస్తుదారులు, ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.