కారు అద్దెకు తీసుకొని పంజాబ్లో అమ్మేశాడు..!
HYD: చందానగర్లో సెల్ఫ్ డ్రైవ్ కారు మోసం కలకలం రేపింది. మహ్మద్ నజీర్ అనే వ్యక్తి పెళ్లి సాకుతో సుమన్ అనే వ్యక్తి కారును యాప్ ద్వారా అద్దెకు తీసుకున్నాడు. గడువు ముగిసినా కారు ఇవ్వకుండా ఫోన్ స్విచ్ఆఫ్ చేయడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు దర్యాప్తు చేయగా ఆ కారును పంజాబ్లో రూ.11.50 లక్షలకు విక్రయించినట్లు తేలింది. వెంటనే నిందితుడిని అరెస్ట్ చేశారు.