VIDEO: పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన
నెల్లూరు రూరల్ నియోజకవర్గం 41వ డివిజన్ మనుమసిద్ధి నగర్లో రూ.2 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ముందుగా స్థానిక ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి, పూల వర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు.