డూప్లికేట్ వస్తువులపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం

WGL: నగరంలో కాకతీయ ఎలక్ట్రికల్ డీలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డూప్లికేట్ వస్తువులకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం కార్యాచరణ రూపొందించారు. ప్రచార సాధనాల ద్వారా, పాంప్లెట్ల ద్వారా డూప్లికేట్ వస్తువులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని తెలిపారు. గతంలో 6 షాపులను తనిఖీ చేసి కేసులు నమోదు చేసినా పద్ధతి మారడం లేదన్నారు.